మార్కెట్లకు ‘శక్తి’ బూస్ట్‌

12 Dec, 2018 16:37 IST|Sakshi

సాక్షి,ముంబై:  స్టాక్‌మార్కెట్లు వారాంతంలో  చాలా హుషారుగా ముగిసాయి. ఆరంభంనుంచి హవా చాటుకున్న కీలక సూచీలు చివరకంటూ అదే జోరును కొనసాగించాయి.  సెన్సెక్స్‌  629 పాయింట్లు ఎగిసి 35,779 వద్ద, నిఫ్టీ 188 పాయింట్లు లాభపడి 10,737వద్ద బలంగా స్థిరపడ్డాయి. రెండు రోజుల్లో 800పాయింట్లకు పైగా ఎగిసింది. దీంతో 5 వారాల్లో ఒక రోజులో అతిపెద్ద లాభాలుగా నిలిచాయి.  నిఫ్టీ బ్యాంకు 480 పాయింట్లు ఎగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు,  దేశీయంగా  ఆర్‌బీఐకు కొత్త గవర్నర్‌ ఎంపిక లాంటి  అంశాలు ఇన్వెస్టర్లకు  ఉత్సాహిమిచ్చినట్టు మార్కెట్‌ వర్గాలు  అంచనా వేశాయి.

హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు భారీగా పుంజుకున్నాయి.  ఇంకా ఐబీ హౌసింగ్, ఎయిర్‌టెల్‌, హీరోమోటో 7 శాతం చొప్పున జంప్‌చేయగా.. అదానీ పోర్ట్స్‌, యూపీఎల్‌, యస్‌ బ్యాంక్‌, ఐషర్‌, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌ 5.5-3.7 శాతం మధ్య పురోగమించాయి.   మరోవైపు డా. రెడ్డీస్‌, భారతి ఇన్‌ ఫ్రాటెల్‌, హెచ్‌పీసెల్‌, టైటన్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.

మరిన్ని వార్తలు