ఫెడ్‌ భయం: నష్టాల ముగింపు

26 Sep, 2018 16:12 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లో ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది.   వరుసగా రెండో రోజుకూడా కీలక సూచీలు లాభనష్టాల మధ్య కదలాడుతూ చివరకు నష్టాల్లో ముగిసాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే లాభాల డబుల్‌ సెంచరీ చేసిన సెన్సెక్స్‌  ఇన్వెస్టర్ల అమ్మకాలతో 300 పాయింట్లకు పైగా క్షీణించింది. ముగింపులో 110 పాయింట్లు  క్షీణించి 36,542 వద్ద, నిఫ్టీ  14 పాయింట్ల నష్టంతో 11,053 వద్ద ముగిసింది. పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఆటో సెక్టార్లు క్షీణించగా రియల్టీ  లాభపడింది.

టాటా మోటార్స్‌, భారతి ఎయిర్‌టెల్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, విప్రో, టీసీఎస్‌ టాప్‌ లూజర్స్‌గా నిలవగా, ఇండియా బుల్స్‌ , యూపీఎల్‌, వేదాంత, టైటన్‌, హిందాల్కోటాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి.  ఇంకా రియల్టీ కౌంటర్లలో యూనిటెక్‌, హెచ్‌డీఐఎల్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఒబెరాయ్‌, శోభా, డీఎల్‌ఎఫ్‌, ఇండియాబుల్స్‌  బాగా లాభపడ్డాయి. అలాగే చక్కెర పరిశ్రమకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికప్యాకేజీ నేపథ్యంలో ఇటీవల నష్టాలతో పాలైన షుగర్‌  షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. దీంతో దాదాపు అన్ని షుగర్‌ షేర్లు లాభాలతో ముగిసాయి.

మరిన్ని వార్తలు