అమ్మకాల ఒత్తిడి : భారీ నష్టాలు

12 Nov, 2018 16:05 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆరంభ లాభాలన్నీ ఆవిరైపోగా, చివరికి భారీ నష్టాలను మూటగట్టుకుంది. మిడ్‌సెషన్‌నుంచి పెరిగిన అమ్మకాల ఒత్తిడి చివరకంటూ కొనసాగిగింది. దీంతో సెన్సెక్స్‌ 346 పాయింట్లు కోల్పోయి 34,813 వద్ద,  నిఫ్టీ 103పాయింట్లు పతనమై 10482 వద్ద ముగిసింది. తద్వారా సెన్సెక్స్‌ 35వేల స్థాయికి దిగువకు చేరగా, నిఫ్టీ 10500 స్థాయిని కోల్పోయింది. పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో, రియల్టీ, మెటల్‌,  ఎనర్జీ  షేర్లు భారీగా నష్టపోయాయి. హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, బజాజ్‌  ఫిన్‌, హిందాల్కో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. టాటా స్టీల్‌, కొటక్‌మహీంద్ర, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌టీ టాప్‌ విన్నర్స్‌గా నిలిచాయి.

అటు డాలరు మారకంలో  రుపీ భారీగా నష్టపోయింది.  54పైసలు కోల్పోయి 73.04 స్థాయికి చేరింది.

>
మరిన్ని వార్తలు