6 రోజుల తర్వాత నష్టాలు

21 Aug, 2014 02:40 IST|Sakshi
6 రోజుల తర్వాత నష్టాలు

ఆరు రోజుల వరుస లాభాల తరువాత మార్కెట్లు మళ్లీ నష్టపోయాయి. సెన్సెక్స్ 106 పాయింట్లు క్షీణించి 26,314 వద్ద ముగిసింది. గత ఆరు రోజుల్లో 1,091 పాయింట్లు లాభపడ్డ కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపట్టినట్లు నిపుణులు విశ్లేషించారు. ఇక నిఫ్టీ సైతం 22 పాయింట్లు తగ్గి 7,875 వద్ద నిలిచింది.  మంగళవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ 26,530 వద్ద, నిఫ్టీ 7,918 వద్ద కొత్త రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
 
దేనా బ్యాంక్, ఓబీసీ డీలా
 కస్టమర్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము రూ. 439 కోట్లను దుర్వినియోగ పరిచాయన్న ఆరోపణలతో దేనా బ్యాంక్(రూ. 256 కోట్లు), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(రూ. 180 కోట్లు)లపై ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించిందన్న వార్తలు ఈ బ్యాంక్ షేర్లను పడగొట్టాయి. దేనా బ్యాంక్ 5%, ఓబీసీ 3.5% చొప్పున పతనమయ్యాయి.
 
ఫార్మా, స్మాల్‌క్యాప్ షేర్ల హవా
 మార్కెట్ నష్టపోయినప్పటికీ బీఎస్‌ఈలో హెల్త్‌కేర్ ఇండెక్స్ 3% ఎగసింది. మార్కెట్ల ట్రెండ్‌కు విరుద్ధంగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 1% బలపడింది.

మరిన్ని వార్తలు