బడ్జెట్‌కు ‘ముందు’ జాగ్రత్త

31 Jan, 2018 01:15 IST|Sakshi

బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు

250 పాయింట్ల నష్టంతో 36,034కు సెన్సెక్స్‌

81 పాయింట్లు పడిపోయి 11,050కు నిఫ్టీ  

స్టాక్‌ సూచీలు శిఖర స్థాయిలకు ఎగసిన నేపథ్యంలో మంగళవారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉండడం కూడా తోడవడంతో స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 250 పాయింట్ల నష్టంతో 36,034 పాయింట్ల వద్ద, నిఫ్టీ 81 పాయింట్ల నష్టంతో 11,050 పాయింట్ల వద్ద ముగిశాయి. మరో రెండు రోజుల్లో బడ్జెట్‌ రానున్నందున ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరిపారని, తాజా పొజిషన్లు తీసుకోలేదని నిపుణులు పేర్కొన్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 290 పాయింట్ల దాకా నష్టపోయింది.

ప్రపంచ మార్కెట్ల పతనం...: టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తిన కారణంగా అమెరికా మార్కెట్‌ సోమవారం నష్టపోయింది. ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లు కూడా పతనం కావడం, యూరప్‌ మార్కెట్లు నష్టాల్లో ఆరంభం కావటం... మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించాయి.

మరో వైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రెండు రోజుల సమావేశం బుధవారం నుంచి ఆరంభం కానుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. మొత్తం మీద అంతర్జాతీయ మార్కెట్ల బలహీనత మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు.

లాభాల్లో ఓఎమ్‌సీలు...
ఐఓసీ క్యూ3 ఫలితాలు అంచనాలను మించడం, 1:1 బోనస్‌ ఇవ్వనుండడం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో ఇతర ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌లు 3–5 శాతం రేంజ్‌లో పెరిగాయి. ఈ క్యూ3లో నికర నష్టాలు తగ్గడంతో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 10 శాతం లాభంతో రూ.30 వద్ద ముగిసింది.  


నేటి బోర్డ్‌ మీటింగ్స్‌ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ, వేదాంత, ఐడీబీఐ బ్యాంక్, అరవింద్, హిందుస్తాన్‌ కాపర్, హిందుస్తాన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, ఐఐఎఫ్‌ఎల్, జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్, జేకే లక్ష్మీ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పీవీఆర్, షాపర్స్‌ స్టాప్, అలెంబిక్‌ ఫార్మా, డాబర్‌ ఇండియా, ఎస్కార్ట్స్, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, ఫిలిప్స్‌ కార్బన్, విమ్టా ల్యాబ్స్, ఆర్చీస్, హెచ్‌సీఎల్‌ ఇన్ఫోసిస్టమ్స్, హెచ్‌ఈజీ

మరిన్ని వార్తలు