మిశ్రమంగా ముగిసిన మార్కెట్లు

7 Mar, 2019 15:40 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు ఒడిదుడకులమధ్య ఊగిసలాడుతూ  చివరికి లాభాల్లో ముగిసాయి. మిడ్‌సెషన్‌ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు పెంచడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్ బాట పట్టాయి. 150 పాయింట్లకుపైగా ఎగిసినా చివరికి సెన్సెక్స్‌ 89 పాయింట్లు లాభంతో  36,725 వద్ద, నిఫ్టీ కేవలం 5 పాయింట్లు  లాభానికి పరిమితమై 11,058 వద్ద ముగిసింది. గత మూడు రోజులుగా జోరు చూపుతున్న మార్కెట్లలో తొలుత ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో హెచ్చుతగ్గులను చవిచూసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 

పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ లాభపడగా, మీడియా, మెటల్‌, ఫార్మా, ఐటీ రంగాలు నష్టపోయాయి. హెచ్‌పీసీఎల్‌, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌, టీసీఎస్‌ లాభపడగా ఐబీ హౌసింగ్‌, విప్రో, కోల్‌ ఇండియా, జీ, ఐవోసీ, టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్, ఎన్‌టీపీసీ, సన్‌ ఫార్మా, ఇన్ఫోసిస్ నష్టాల్లో ముగిశాయి.

>
మరిన్ని వార్తలు