వరుసగా రెండో సెషన్‌లో నష్టాలు

28 Jan, 2019 15:57 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాకమార్కెట్లు తీవ్ర కరెక్షన్‌కు గురయ్యాయి.  అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ  దేశీయంగా అమ్మకాల ఒత్తిడినెదురొన్నాయి.  మిడ్‌ సెషన్‌నుంచి ఊపందుకున్న అమ్మకాలు చివరి వరకూ కొనసాగాయి. చివరికి సెన్సెక్స్‌  369 పాయింట్లు పతనమై 35656 వద్ద, నిఫ్టీ 119 పాయింట్లు క్షీణించి 1066ల వద్ద స్థిరపడ్డాయి.  తద్వారా కీలక మద్దతు స్థాయిలకు ఎగవన    స్థిరంగా నిలబడలేక పోయాయి.

ముఖ్యంగా అదానీ గ్రూపు షేర్లు 10శాతం కుప్ప కూలాయి.  ఇంకా మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ (2.10శాతం), నిఫ్టీ బ్యాంకు  (1.7శాతం) హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ (శాతం) నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఫార్మా, మెటల్‌, ఆటో, ఎనర్జీ, పవర్‌  అండ్‌ గ్యాస్‌  సెక్టార్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి కనిపించింది.  ఒక్క మీడియా మాత్రం స్వల్పంగా లాభపడింది.  రానున్న యూనియన్‌ బడ్జెట్‌  నేపథ్యంలో  ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీసినట్టు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.   

క్యాడిలా, అపోలో, దివీస్‌, 2 శాతం కుప్పకూలగా, బ్యాంకింగ్లో ఎస్‌ బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌, ఐసీఐసీఐ నష్టపోయాయి. రిలయన్స్‌ , అబాన్‌ ఆఫ్‌షోర్‌, అదానీ,  వేదాందా, సెయిల్‌ జిందాల్‌ స్టీల్‌,  జెఎస్‌డబ్ల్యూ , బజాజ్‌  ఫైనాన్స్‌, హీరో మోటో, బజాజ​ ఆటో, టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు