ఐటీ జోష్‌- 35,000కు సెన్సెక్స్‌

26 Jun, 2020 16:04 IST|Sakshi

సెన్సెక్స్‌ 329 పాయింట్లు ప్లస్‌

 35,171 వద్ద ముగింపు

94 పాయింట్లు ఎగసిన నిఫ్టీ

4% జంప్‌చేసిన ఐటీ ఇండెక్స్‌

ఎఫ్ఎంసీజీ, రియల్టీ, ఫార్మా వీక్‌

సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం యాక్సెంచర్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో  ఐటీ దిగ్గజాలు జోరందుకోవడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు రెండు రోజుల నష్టాలకు చెక్‌ పెట్టాయి. మరోపక్క అంతర్జాతీయ సంకేతాలు హుషారునివ్వడంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడ్డారు. వెరసి ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్ తిరిగి 35,000 పాయింట్ల కీలక మార్క్‌ ఎగువన ముగిసింది. సెన్సెక్స్‌ 329 పాయింట్లు జంప్‌చేసి 35,171 వద్ద నిలిచింది. నిఫ్టీ 94 పాయింట్లు ఎగసి 10,383 వద్ద స్థిరపడింది. కాగా.. సెన్సెక్స్‌ 35,145 వద్ద ప్రారంభమై 35,255వరకూ బలపడింది. అయితే మిడ్‌సెషన్‌లో 34,910 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఇక నిఫ్టీ 10,405- 10,311 పాయింట్ల మధ్య గరిష్ట కనిష్టాలకు చేరింది.

మెల్‌, బ్యాంకింగ్‌ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ ఇండెక్స్‌ 4 శాతం జంప్‌చేయగా.. మెటల్‌, బ్యాంకింగ్‌ 1-0.5 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, ఫార్మా రంగాలు 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫోసిస్‌, బీపీసీఎల్‌, టీసీఎస్‌, ఐవోసీ, ఇండస్‌ఇండ్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, హిందాల్కో, శ్రీసిమెంట్‌ 7-3 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, ఇన్‌ఫ్రాటెల్‌, కొటక్ బ్యాంక్‌, టాటా మోటర్స్‌, సన్‌ ఫార్మా, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్, వేదాంతా, టైటన్‌ 3-1 శాతం మధ్య నీరసించాయి.

నిట్ టెక్‌ అప్
డెరివేటివ్స్‌లో నిట్‌ టెక్‌, ఉజ్జీవన్‌, టాటా పవర్‌, ఐడియా, హెచ్‌పీసీఎల్‌ 6.5-4 శాతం మధ్య పురోగమించాయి. కాగా.. మ్యాక్స్‌ ఫైనాన్స్‌, పీవీఆర్‌, అపోలో హాస్పిటల్స్‌, యూబీఎల్‌, ఎన్‌సీసీ, అశోక్‌ లేలాండ్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ 3.6-2.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.2 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1656 లాభపడగా.. 1062 నష్టపోయాయి.

ఎఫ్‌పీఐలు భేష్‌
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ.  1051 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 256 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.  బుధవారం ఎఫ్‌ఫీఐలు రూ. 1767 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1525 కోట్ల అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు