తొలి సంతకం : కొత్త తీరాలకు మార్కెట్‌

16 Jan, 2020 10:12 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు సరికొత్త గరిష్టాల పరుగు కొనసాగుతోంది. గురువారం దలాల్‌ స్ట్రీల్‌ కొత్త జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్‌ 42వేల కీలకమైన గరిష్టస్తాయిని అధిగమించింది. నిఫ్టీ కూడా 12, 383 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందాలపై తొలి సంతకం చేసిన నేపథ్యంలో అంతర్జాతీయంగా, ముఖ్యంగా ఏషియన్‌ మార్కెట్లు  సానుకూల సంకేతాలతో ఆరంభంలోనే లాభాలనార్జించిన సూచీలు, ఆ తరువాతం వేగం పుంజుకున్నాయి. కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్‌ 155 పాయింట్లు ఎగిసి 42028 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 12380 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు లాభాలతో కళకళలాడుతున్నాయి. ముఖ‍్యంగా బ్యాంకింగ్‌, ఫార్మ  షేర్లు మార్కెట్‌కు ఊతమిస్తున్నాయి. మరోవైపు మెటల్‌ షేర్లలో అమ్మకాలు కనిపిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీలాంటి, రిలయన్స్‌, కొటక్‌బ్యాంకు లాంటి దిగ్గజాలతో పాటు  యస్‌బ్యాంకు, సన్‌ఫార్మ, నెస్లే, హచ్‌యూఎల్‌, పవర్‌గ్రిడ్‌ భారీగా లాభపడుతున్నాయి. మరోవైపు వేదాంతా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌,  హీరోమోటో నష్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు