లాభాల్లో సూచీలు : ఐటీ, ఫార్మా డౌన్‌

3 May, 2019 14:01 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో తొలుత ఫ్లాట్‌గా ప్రారంభమైన  సెన్సెక్స్‌ అనంతరం సెంచరీ  లాభాలతో 39 వేల పాయింట్ల మైలురాయి ఎగువకు చేరింది. ప్రస్తుతం 117 పాయింట్లు ఎగసి 39,103వద్ద, నిఫ్టీ సైతం 31పాయింట్లు బలపడి 11,756 వద్ద ట్రేడవుతోంది.  

పీఎస్‌యూ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, రియల్టీ, ఆటో రంగాలు లాభపడుతుండగా, ఐటీ  ఫార్మా  నష్టపోతున్నాయి.  బీవోబీ, కెనరా, సిండికేట్‌, బీవోఐ, పీఎన్‌బీ, ఇండియన్‌ బ్యాంక్‌, ఓబీసీ, యూనియన్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ తదితర బ్యాంకు షేర్లతోపాటు  రియల్టీ స్టాక్స్‌లో ప్రెస్టేజ్‌, డీఎల్‌ఎఫ్‌, శోభా, ఒబెరాయ్‌, సన్‌టెక్‌, గోద్రెజ్‌ సీపీ, బ్రిగేడ్‌  భారీగా పుంజుకున్నాయి.   టీసీఎస్‌ హెచ్‌సీఎల్‌, టెక్‌ మహీంద్ర, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, హెచ్‌యూఎల్‌, విప్రో, జీ,  డా. రెడ్డీస్‌ నష్టపోతున్నాయి.

మరిన్ని వార్తలు