స్వల్ప నష్టాలలో స్టాక్మార్కెట్లు

11 Aug, 2015 09:47 IST|Sakshi
స్వల్ప నష్టాలలో స్టాక్మార్కెట్లు

ముంబై:  మంగళవారం నాటి దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 77 పాయింట్ల నష్టంతో 28, 024 దగ్గర, నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 8,498 దగ్గర ట్రేడవుతున్నాయి.  బ్యాంకింగ్  దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫలితాలను ఈరోజు ప్రకటించనుంది.  అలాగే సన్ఫార్మా ఫలితాలు కూడా రానున్నాయి.  ఈ రెండు ఫలితాల  ప్రభావం మార్కెట్ పై ఉండొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.   మరోవైపు పార్లమెంటులో కొనసాగుతున్న ప్రతిష్టంభన,  కీలకమైన బిల్లులు  పెండింగ్ లో పడుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లవైపు మొగ్గు చూపడంలేదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

అటు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మరింత బలహీనపడింది. 64 రూపాయలపైన ట్రేడవుతోంది.

 

మరిన్ని వార్తలు