4 వారాల కనిష్టం

9 Aug, 2014 01:58 IST|Sakshi
4 వారాల కనిష్టం

 ఇరాక్ మిలటెంట్లపై వైమానిక దాడులు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా సైన్యానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్ బలహీనపడింది. మరోవైపు ఉక్రెయిన్-రష్యా ఆందోళనలు, గాజాపై ఇజ్రాయెల్ దాడులు వంటి అంశాలు సైతం దీనికి జత కలిశాయి. ఇప్పటికే రష్యాపై అమెరికా, యూరప్ ఆంక్షల నేపథ్యంలో పశ్చిమ దేశాల నుంచి ఆహార సరుకుల దిగుమతులను రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తాజాగా నిషేధించడం ప్రపంచ ఇన్వెస్టర్లలో భయాలు రేపింది. వెరసి ఇండియాసహా ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి.

సెన్సెక్స్ 260 పాయింట్లు క్షీణించి 25,329 వద్ద ముగిసింది. ఇది నాలుగు వారాల కనిష్టంకాగా, నిఫ్టీ సైతం 81 పాయింట్లు పతనమై 7,569 వద్ద స్థిరపడింది. వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 579 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్‌లో ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి.

 మరిన్ని సంగతులివీ...
బీఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ నష్టపోగా... రియల్టీ, పవర్, మెటల్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఆయిల్ రంగాలు 4-1.5% మధ్య నీరసించాయి.

సెన్సెక్స్‌లో ఐదు షేర్లు మాత్రమే లాభపడగా భారతీ ఎయిర్‌టెల్ 2% ఎగసింది. ఇతర దిగ్గజాలలో సెసా స్టెరిలైట్ దాదాపు 6% దిగజారింది. ఈ బాటలో టాటా పవర్, భెల్, టాటా స్టీల్, హిందాల్కో, ఎల్‌అండ్‌టీ, గెయిల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 4-2% మధ్య క్షీణించాయి.

బీఎస్‌ఈ-500లో పుర్వంకారా 15% పడిపోగా, భూషణ్ స్టీల్, సి.మహీంద్రా, వర్ధమాన్, బాంబే డయింగ్, జిందాల్ స్టెయిన్‌లెస్, రేమండ్, హెచ్‌సీసీ, ధనలక్ష్మీ బ్యాంక్, బీజీఆర్ 10-6% మధ్య పతనమయ్యాయి.

మరిన్ని వార్తలు