చివరికి నస్టాలే, 12100 దిగువకు నిఫ్టీ

20 Feb, 2020 16:18 IST|Sakshi

సాక్షి,ముంబై : దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. మిడ్‌ సెషన్‌ తరువాత స్వల్పంగా పుంజుకున్నప్పటికీ చివరికి వారాంతంలో బలహీనంగానే ముగిసాయి. రోజంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన సెన్సెక్స్ 155 పాయింట్లు క్షీణించి 41170 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు తగ్గి 12081వద్ద స్థిరపడింది. తద్వారా నిఫ్టీ 12100 దిగువకు చేరింది. పవర్‌, ఎఫ్‌ఎంసిజి, ఇన్‌ఫ్రా, ఫార్మా, ఐటీ రంగాల్లో అమ్మకాలు జోరు కొనసాగగా, మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకులలో కొనుగోళ్లు కనిపించాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్, టాటా స్టీల్, ఎస్‌బీఐ ఎక్కువ లాభాలు సాధించగా, సిప్లా, ఏషియన్ పెయింట్స్,హెచ్‌యూఎల్, టిసీస్‌, టెక్‌ మహీంద్ర నష్టపోయాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయిబలహీనత గురువారం కూడా కొనసాగింది. 22 పైసలు క్షీణించి 71.78 వద్ద  ఏడు వారాల కనిష్టానికి చేరింది. మహాశివరాత్రి  పర్వదినం సందర‍్భంగా రేపు (21, శుక్రవారం) స్టాక్‌మార్కెట్లకు సెలవు.
 

మరిన్ని వార్తలు