-

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

8 Jun, 2017 15:57 IST|Sakshi

 ముంబై: దేశీయ   స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాల్లో క్లోజ్‌ అయ్యాయి. సెన్సెక్స్‌ 58 పాయింట్లు  క్షీణించి 31,213  వద్ద,  నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 9,647 వద్ద ముగిశాయి.  ఐటీ, బ్యాంకింగ్‌ నిలదొక్కుకోగా,  ఫార్మా జోష్‌గా కొనసాగింది. దీంతోపాటు మిడ్‌ క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ కూడా లాభాల్లోనే  ముగిశాయి.  యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ పాలసీ సమావేశం, యు.కే. ఎన్నికలు, మాజీ ఎఫ్‌బీఈఐ డైరెక్టర్ జేమ్స్ కామీ నుంచి కాంగ్రెస్ సాక్ష్యాలు సహా అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో​ దేశీయ  మార్కెట్లు గురువారం  ఫ్లాట్‌గా మారాయి.  

అయితే, ఫార్మా షేర్లు 2  శాతానికిపైగా లాభపడ్డాయి.  ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ 4.2 శాతం, సన్‌ఫార్మా 3.46 శాతం పెరిగింది. సిప్లా, అరబిందో ఫార్మా కూడా 2 శాతం  లాభపడ్డాయి. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా దాని ద్రవ్యోల్బణ అంచనాలను గణనీయంగా తగ్గించిన తర్వాత, హెడ్‌డీఎఫ్‌సీ లాంటి బ్యాంకింగ్ షేర్లు కూడా లాభపడ్డాయి. ఐటి ఇండెక్స్ 1.46 శాతం పడిపోయింది. ఐటీ రంగం వరుసగా రెండో రోజు కూడా బలహీనంగానే ముగిసింది.  గెయిల్‌ 4.3 శాతం,  టీసీఎస్‌ 3.6 శాతం నష్టపోయాయి.  వీటితోపాటు  ఐవోసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, హీరోమోటో, ఐసీఐసీఐ, బీపీసీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎయిర్‌టెల్‌, బీవోబీ నష్టపోగా టాటా స్టీల్‌, లుపిన్‌, కొటక్‌ బ్యాంక్‌  ధ్య పుంజుకున్నాయి.
రిలయన్స్ కమ్యునికేషన్స్ యొక్క వాటాలు తమ స్లాడ్ను కొనసాగించాయి, బుధవారం వారి రేటింగ్ల క్షీణతతో ముడిపడి ఉన్న మొబైల్ క్యారియర్ మూడీస్ మరియు ఫిచ్ట్లకు వ్యతిరేకంగా తిరోగమించింది. వాటాలు 2.8 శాతానికి పడిపోయాయి. పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ 3.4శాతం క్షీణించింది.  
అటు డాలర్‌మారకంలో  రుపీ 0..02 పైసలు లాభపడి రూ. 64.32 వద్ద ఉంది. బంగారం ఎంసీఎక్స్‌మార్కెట్‌ లో పది గ్రా. రూ.142 క్షీణించి రూ. 29, 298 వద్ద  ఉంది.
 
 

మరిన్ని వార్తలు