మూడో రోజు అదేతీరు; 12100 ఎగువన నిఫ్టీ

22 Jan, 2020 15:42 IST|Sakshi

రోజంతా నష్టాల్లో కదలాడిన సూచీలు

12100 స్థాయి వద్ద పటిష్టంగా ముగిసిన నిఫ్టీ

బ్యాంక్స్‌, ఆటో, మెటల్‌ షేర్లు డీలా

సాక్షి,ముంబై : దేశీయస్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లోనే ముగిసాయి. రోజంతా నష్టాల మధ్య కదలాడిన కీలక సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అయితే నిఫ్టీ కీలక మద్దతు స్థాయి 12100 కి ఎగువన ముగియగా, సెన్సెక్స్‌ 208 పాయింట్లు క్షీణించి 41115 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఐటీ షేర్లు మాత్రం బాగా లాభపడ్డాయి.  గ్రాసిం, జీ, నెస్లే, హెచ్‌సీఎల్‌టెక్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస​, అదానీ పోర్ట్స్‌, యస్‌ బ్యాంకు  ఐవోసీ టాప్‌ విన్నర్స్‌గా నిలవగా, ఓన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌, కోటక్‌ మహీంద్ర, పవర్‌గ్రిడ్‌ మారుతి, యూపీఎల్‌ టాప్‌ లూజర్స్‌గా మిగిలాయి. .

మరిన్ని వార్తలు