నష్టాల్లో మార్కెట్లు

24 Oct, 2019 13:57 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా రెండో రోజూ లాభాలతో  ప్రారంభమైన సెన్సెక్స్‌ 150 పాయింట్లు ఎగిసి 39వేల ఎగువన, నిఫ్టీ  11600 ఎగువన కొనసాగింది.  అనంతరం తీవ్ర అమ్మకాలతో నష్టాల్లోకి జారుకుంది.  ప్రస్తుతం సెన్సెక్స్‌170 పతనమై 38890 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు క్షీణించి 11549 వద్దద్ద కొనసాగుతోంది. తీవ్రమైన ఊగిసలాట ధోరణి నెలకొంది.

బ్యాంకింగ్‌, ఐటీ, టెక్నాలజీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి. గ్రాసిం, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, ఇండస్‌ఇండ్‌, ఎస్‌బీఐ, భారతి ఎయిర్‌టెల్‌, గెయిల్‌ నష్టపోతుండగా, హెచ్‌సీఎల్‌ టెక్‌ , రిలయన్స్‌, వేదాంతా, ఏసియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, ఐషర్‌ మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌ , ఎల్‌అండ్‌టీ  లాభపడుతున్నాయి.    

మరిన్ని వార్తలు