భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు

25 Nov, 2014 16:57 IST|Sakshi

నిన్నటి వరకు బ్రహ్మాండమైన లాభాలు సాధించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. సెన్సెక్స్ 161.49 పాయింట్లు నష్టపోయి 28,338.05 వద్ద ముగిసింది. గడిచిన ఆరు వారాల్లో సెన్సెక్స్ ఇంతగా నష్టపోవడం ఇదే తొలిసారి. ఇక నిఫ్టీ అయితే ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ఓ దశలో 8535.35 పాయింట్లను తాకినా, చివరకు 67 పాయింట్లు నష్టపోయి 8463.10 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ ఓ దశలో మరీ కనిష్ఠంగా 28,217.50 పాయింట్ల స్థాయికి దిగిపోయినా, మళ్లీ కొంతవరకు కోలుకుని 28,338.05 వద్ద ముగిసింది. దీంతో అక్టోబర్ 16 తర్వాత ఇదే అత్యధిక నష్టంగా రికార్డయింది. సోమవారం నాటి ట్రేడింగులో సెన్సెక్స్ ఓ దశలో అత్యధికంగా 28,541.96 పాయింట్లను తాకి, చివరకు 28,499.54 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 8535.35 పాయింట్లను ఓ దశలో తాకింది. మోదీ టైం బాగుందని, అందుకే మార్కెట్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయని అనుకున్న కొద్ది రోజులకే ఉన్నట్టుండి ఇలా పతనం కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు