35వేల కిందికి సెన్సెక్స్‌

22 Nov, 2018 15:46 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాకమార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.  ఆరంభం​ లాభాలనుంచి  వెనక్కి తగ్గిన కీలక  సూచీలు కీలక మద్దతు స్తాయిలకు   దిగువకు చేరాయి.   మిడ్‌సెషన​ తరువాత అమ్మకాగా భారీగా పెరగడంతో సెన్సెక్స్‌  219 పాయింట్లు పతనమై 34,981వద్ద, నిఫ్టీ 73పాయింట్లు క్షీణించి 10,526 వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్‌ 35వేల దిగువకు,నిఫ్టీ 10600 వేల స్థాయికి కిందన ముగిసాయి. మెటల్‌  బాగా నష్టపోగా, ఒక్క మీడియా తప్ప అన్ని రంగాలు నష్టపోయాయి. 

హిందాల్కో  దాదాపు 3శాతం పతనమై టాప్‌ లూజర్‌గా ఉంది.  ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీలు, సిమెంట్‌ షేర్లు నష్టపోయాయి.  ఎంఅండ్‌ఎం,  అల్ట్రాటెక్‌,  గ్రాసిం, పవర్‌గ్రిడ్‌, బీపీసీఎల్‌, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, విప్రో  టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 5శాతం లాభపడింది.  అదానీ పోర్ట్స్‌, టీసీఎస్, ఐబీ హౌసింగ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, హీరో మోటో లాభపడ్డాయి. మరోవైపు రేపు  (నవంబరు23)  గురునానక్‌ జయంతి సందర్భంగా మార్కెట్లుకు సెలవు.
 

మరిన్ని వార్తలు