ఆగని నష్టాలు, 11100 కిందికి నిఫ్టీ

30 Jul, 2019 15:05 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయస్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. కొద్ది రోజులుగా వాటిల్లుతున్న నష్టాలకు చెక్‌ పెడుతూ హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు  మిడ్‌ సెషన్‌ తరువాత మరింత   మరింత బలహీన పడ్డాయి. ప్రారంభంలో సెంచరీ చేసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 296 పాయింట్లు పతనమై 37,389 వద్ద,   నిఫ్టీ సైతం102 పాయింట్లు  క్షీణించి  11,086  వద్ద ట్రేడవుతోంది.  తద్వారా నిఫ్టీ 11100 స్థాయిని  కూడా బ్రేక్‌ చేసి మరింత బలహీనంగా కదులుతోంది. 

దాదాపు అన్ని రంగాలు నష్టపోతున్నాయి.  ఇన్‌ఫ్రాటెల్‌, హీరో మోటో, గ్రాసిమ్‌, బ్రిటానియా, యస్‌ బ్యాంక్‌, వేదాంతా, టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, యాక్సిస్‌, ఐవోసీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. అలాగే  ప్రభుత్వ రంగ బ్యాంక్‌ కౌంటర్లలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, బీవోబీ, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌ నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు