నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

29 Aug, 2019 14:15 IST|Sakshi


సాక్షి, ముంబై : దేశీ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా పతనం దిశగా కదులుతున్నాయి. ఆరంభ నష్టాల నుంచి మాత్రం కోలుకోలేని సూచీలు  మిడ్‌ సెషన్‌నుంచి మరింత కుదలేయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలతో సెన్సెక్స్ 400 పాయింట్లకు  పైగా క్షీణించిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 292 పాయింట్లు క్షీణించి 37,160 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 10,975 వద్ద ట్రేడవుతోంది.  ఒకదశలో  నిఫ్టీ10950 పాయింట్ల మరో కీలక మార్క్‌ దిగువకు చేరింది. బాండ్ల ఈల్డ్స్‌ తిరోగమిస్తున్న కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక మాంద్య భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు గురువారం (నేడు) ఆగస్ట్‌ డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులు తప్పవని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ప్రధానంగా ఐటీ, బ్యాంక్‌ నిఫ్టీ  నష్టపోతుండగా, మెటల్‌, ఫార్మా  లాభపడుతున్నాయి.  సన్‌ ఫార్మా, కోల్‌ ఇండియా, వేదాంతా, టాటా మోటార్స్‌, ఐషర్‌, ఇండస్‌ఇండ్, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ, జీ టాప్‌ విన్నర్స్‌గా కొనసాగుతుండగా, ఐబీ హౌసింగ్‌, యస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, బ్రిటానియా, గ్రాసిమ్‌, యాక్సిస్‌, బజాజ్‌ ఆటో, కొటక్‌ మహీంద్రా  ప్రధానంగా నష్టపోతున్నాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు