స్టాక్‌మార్కెట్ల పతనం, 10800 దిగువకు నిఫ్టీ

22 Aug, 2019 14:43 IST|Sakshi

సాక్షి, ముంబై: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్‌ మిడ్‌ సెషన్‌లో మరింత కుదేలైంది. ఇన్వెస‍్టర్ల అమ్మకాలతో సెన్సెక్స్‌ ఒక దశలో449 పాయింట్లుకుప్ప కూలింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 37,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. అటు నిఫ్టీ కూడా 10800 దిగువకు జారింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 442  పాయింట్లు నష్టపోయి 36,618కు చేరగా, నిఫ్టీ 141 పాయింట్లు క్షీణించి 10781 వద్ద ట్రేడవుతోంది. 

ప్రధానంగా రియల్టీ 5.4 శాతం పతనం కాగా, మెటల్‌, బ్యాంక్స్‌, ఆటో 2-1 శాతం మధ్య నీరసించాయి. అయితే ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, ఐటీ రంగం  స్వల్పంగా లాభపడుతోంది.  యస్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌ 7 శాతం చొప్పున పతనం కాగా,  కోల్‌ ఇండియా, వేదాంతా, యూపీఎల్‌, బజాజ్‌ ఫిన్‌, బీపీసీఎల్‌, ఆర్‌ఐఎల్‌, ఇండస్‌ఇండ్‌, హీరో మోటో  నష్టపోతుండగా,  బ్రిటానియా, డాక్టర్‌ రెడ్డీస్‌, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, గెయిల్, ఇన్‌ఫ్రాటెల్‌, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్, టెక్‌ మహీంద్రా లాభపడుతున్నాయి. రియల్టీ స్టాక్స్‌లో డీఎల్‌ఎఫ్‌ 14 శాతం దిగజారగా..ఒబెరాయ్‌, ఇండియాబుల్స్‌, సన్‌టెక్‌, ఫీనిక్స్‌, శోభా, బ్రిగేడ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా 6-1.3 శాతం మధ్య నీరసించాయి. అటు  డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి మరింత పతనమైంది. ఆరంభ నష్టాలనుంచి మరింత దిగజారి 71.92 వద్ద  రికార్డు కనిష్టానికి చేరింది. 

మరిన్ని వార్తలు