గ్లోబల్‌ ఎఫెక్ట్‌ : నష్టాల్లో మార్కెట్లు

7 Mar, 2018 09:37 IST|Sakshi

ముంబై : గ్లోబల్‌ మార్కెట్ల నుంచి వస్తున్న బలహీనమైన సంకేతాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ప్రారంభంలోనే 100 పాయింట్ల మేర కిందకి పడిపోయింది. ప్రస్తుతం 58 పాయింట్ల నష్టంలో 32,259 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంలో 10,222 వద్ద కొనసాగుతోంది. వైట్‌హౌజ్‌ వాణిజ్య ట్రేడ్‌కు చెందిన కీలక అధికారి, ఎకనామిక్‌ అడ్వియజరీ గ్యారీ కోన్ అనూహ్యంగా రాజీనామా చేయడంతో గ్లోబల్‌ స్టాక్స్‌ కుప్పకూలాయి. దీంతో ట్రేడ్‌ వార్‌ ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. 

జపాన్‌ 0.25 శాతం, ఆస్ట్రేలియన్‌ స్టాక్స్‌ 0.75 శాతం, జపాన్‌ నిక్కీ 0.2 శాతం కిందకి పడిపోయాయి. దేశీయ స్టాక్స్‌లో టాటా మోటార్స్‌ 52 వారాల కనిష్టానికి పడిపోయింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా 113 పాయింట్లు నష్టపోయింది.  యూనియన్‌ బ్యాంకు, కెనరా బ్యాంకు, పీఎఫ్‌సీ, అలహాబాద్‌ బ్యాంకు, కర్నాటక బ్యాంకులు కూడా తాజా 52 వారాల కనిష్టానికి చేరాయి.  ప్రపంచ మార్కెట్ల ఆందోళనలతో పాటు, దేశీయంగా కూడా సెంటిమెంట్‌ బలహీనంగా ఉన్నట్టు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు