లాభాల ముగింపు: ఆటో, పవర్‌ జూమ్‌

26 Jun, 2019 15:56 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మిడ్‌ సెషన్‌ నుంచిపుంజుకున్న సూచీలు చివరి వరకూ దాదాపు అదే జోరును కంటిన్యూ చేశాయి. చివరికి సెన్సెక్స్‌ 151 పాయింట్లు ఎగిసి 39592 వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు లాభపడి 11847 వద్ద ముగిసాయి. బ్యాంక్‌ నిప్టీ కూడా 1.9శాతం ఎగిసింది. దాదాపు అన్ని షేర్లు లాభపడ్డాయి. పవర్‌, మెటల్‌​ టాప్‌ గెయినర్‌గా ఉంది.  ఫార్మా, రియల్టీ  లాభపడగా,  ఐటీ, ఎఫ్‌ఎంసీజీ  స్వల్పంగా నష్ట పోయాయి.

హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ మరోసారి ఆల్‌టైం గరిష్టాన్ని తాకాయి. ఇంక ఎస్‌బ్యాంకు,  వేదాంతా, పవర్‌గ్రిడ్‌, సన్‌ పార్మ, హిందాల్కో, టాటా స్టీల్‌ లాభపడ్డాయి.   బ్రిటానియా, ఇండియా బుల్స్‌, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ ఇండ్‌, భారతి ఎయిర్‌టెల్‌ టెక్‌ మహీంద్ర నష్టపోయాయి. 

>
మరిన్ని వార్తలు