రెండు రోజుల నష్టాలకు చెక్ 

16 Apr, 2020 16:12 IST|Sakshi

సాక్షి, ముంబై :  రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి లాభాలతో ముగిసాయి. తద్వారా వరుసగా గత రెండు సెషన్ల నష్టాలకు ముగింపు పలికాయి.  సెన్సెక్స్ 223 పాయింట్లు ఎగిసి 30603 వద్ద,  నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 8993 వద్ద స్థిరపడ్డాయి.  ఐటీ, ఎఫ్‌ఎంసీజీ మినహా మిగతా అన్ని రంగాలు లాభాలతో ముగిసాయి.  ప్రధానంగా భ్యాంకింగ్, ఫార్మ రంగ షేర్ల భారీ లాభాలనార్జించాయి. హెచ్డీఎఫ్ సీ ట్విన్స్, ఐసీఐసీఐ బ్యాంకు లాభాలు మారెట్లకు ఊతమిచ్చాయి. ఎన్‌టీపీసీ, వేదాంత, , హిందాల్కో  టైటన్, సన్ ఫార్మ, టాప్ విన్నర్స్ గా నిలవగా హెచ్‌సిఎల్ టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్ ,  ఇన్ఫోసిస్ నష్టపోయాయి.  కరోనావైరస్ మహమ్మారి  అనిశ్చితి, అమెరికా వ్యాపారంపై విప్రో వ్యక్తం చేసిన ఆందోళన ఐటి షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. 

>
మరిన్ని వార్తలు