బ్యాంకుల దెబ్బ, నష్టాల ముగింపు

15 Apr, 2020 15:59 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్ మార్కెట్లు  అనూహ్యంగా  నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్‌సెషన్‌ నుంచి ట్రేడర్ల  భారీ అమ్మకాలతో  లాభాలన్నీ ఆవిరైపోయాయి. దీంతో ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన ఉత్సాహంగా కదలాడిన సూచీలు గరిష్టస్థాయిల నుంచి వెనక్కి తగ్గాయి.  సెన్సెక్స్ 31 వేల ,500 స్థాయి (31,568) ఎగువకు, నిఫ్టీ ఒక దశలో 92 వందల  (9261) స్థాయిని అధిగమించింది.   ఈ స్థాయిల వద్ద ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ నష్టాలకుకారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆర్థిక, అటో రంగ, మీడియా రంగ షేర్లలో అమ్మకాలు మార్కెట్లను 1346 పాయింట్ల పతనం దిశగా లాక్కెళ్లాయి. దీంతో  సెన్సెక్స్ 310 పాయింట్లు పతనమై 30380 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 8925 వద్ద ముగిసింది. కోటక్‌ మహీంద్ర, హీరోమోటోకార్ప్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మారుతి సుజుకీ, రిలయన్స్, సన్ ఫార్మ టాప్ లూజర్స్ గా నిలిచాయి. యూపీఎల్,  బ్రిటానియా, హెచ్ యూఎల్,హెచ్ సీఎల్ టెక్, నెస్లే,  అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, శ్రీరాం సిమెంట్స్‌, ఐటీసీ, యూపీఎల్‌ లాభపడ్డాయి.

చదవండి: జీతంలేని సెలవుపై విస్తారా సీనియర్ ఉద్యోగులు
ట్రంప్ టీంలో మన దిగ్గజాలు

మరిన్ని వార్తలు