స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న మార్కెట్లు

22 Aug, 2017 15:47 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి.   లాభనష్టాల మధ్య ఒడిదుడుకులతో  సాగిన మార్కెట్లు చివరికి నష్టాలనుంచికోలుకున్నాయి. ముఖ‍్యంగా తొలుత 180 పాయింట్లు జంప్‌చేసిన సెన్సెక్స్‌ అనంతరం నష్టాల్లోకి జారుకుంది. చివరలో పుంజుకుని సెన్సెక్స్‌ 33  పాయింట్లు  లాభంతో 31,291 వద్ద, నిఫ్టీ11 పాయింట్ల లాభంతో 9765వద్ద ముగిశాయి. మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌  ఆటో, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.

భారత్‌ ఫైనాన్షియల్స్‌, ఎన్‌టీపీసీ, ఇండియా బుల్స్‌, ఐషర్‌  మోటార్స్‌, హీరో మోటార్‌కార్ప్‌, అంబుజా,ఇండియన్‌ హోటల్స్‌, రిలయన్స్ కేపిటల్‌, ఎక్సైడ్‌, క్రాంప్టన్‌, సన్‌ టీ వీ, ఆల్కెమ్‌ లేబ్‌, టొరంట్‌ ఫార్మా, టాటా కమ్యూనికేషన్స్‌, ఇండియన్‌ బ్యాంక్‌, టాటా గ్లోబల్‌ నష్టాల్లోనూ ఇన్ఫోసిస్‌ స్వల్పంగా, ట్రెండ్‌, హెచ్‌సీఎల్‌ లాభాల్లోనూ ముగిశాయి.  
 

మరిన్ని వార్తలు