స్వల్పంగా లాభపడిన సెన్సెక్స్!

6 May, 2014 17:24 IST|Sakshi
స్వల్పంగా లాభపడిన సెన్సెక్స్!
ముంబై: కాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా రెండో రోజు లాభాలతో ముగిసాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 63 పాయింట్ల లాభంతో 22508 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల వృద్దితో 6715 వద్ద ముగిసాయి. 
 
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, లార్సెన్, టాటా మోటార్స్ లాభాల్ని నమోదు చేసుకున్నాయి. పవర్ గ్రిడ్, అంబూజా సిమెంట్స్, భారతీ ఎయిర్ టెల్, టాటా పవర్, హీరో మోటో కార్ప్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి. 
 
ప్రధాన కంపనీల షేర్లలో రిలయన్స్ అత్యధికంగా 2 శాతం పైగా, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, డీఎల్ఎఫ్, ఓఎన్ జీసీ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. భారతీ ఎయిర్ టెల్, హిండాల్కో, హీరో మోటార్ కార్ప్, అంబుజా సిమెంట్, టెక్ మహింద్ర కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 
 
అంతర్జాతీయ మార్కెట్ లో యూరప్ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. 
మరిన్ని వార్తలు