గ్లోబల్‌ ఎఫెక్ట్‌ : మన మార్కెట్లు భారీ పతనం

11 Oct, 2018 16:06 IST|Sakshi

ముంబై : అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా మార్కెట్లు భారీ పతనం కావడంతో కుదేలైన దేశీయ ఈక్వీటీ మార్కెట్లు చివరి వరకు అలానే కొనసాగాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి కూడా దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలనే మూటగట్టుకున్నాయి. గత కొన్ని రోజులుగా మార్కెట్లు, భారీ నుంచి అతి భారీ పతనాన్ని నమోదు చేస్తూ... ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం ఇన్వెస్టర్లకు ఉపశమనవిస్తూ చోటు చేసుకున్న రిలీఫ్‌ ర్యాలీ కూడా, గురువారానికి నిలువలేదు. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 1000 పాయింట్ల మేర కుప్పకూలిన సెన్సెక్స్‌, ట్రేడింగ్‌ చివరికి 760 పాయింట్ల నష్టంతో ముగించింది. 760 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 34001 వద్ద క్లోజైంది. ఇక నిఫ్టీ కూడా అదే బాటలో 225 పాయింట్ల నష్టంలో 10235 వద్ద స్థిరపడింది. గ్లోబల్‌ మార్కెట్లలో నెలకొన్న తీవ్ర అమ్మకాల ఒత్తిడి దేశీయ మార్కెట్లను బాగా దెబ్బకొట్టినట్టు మార్కెట్‌ విశ్లేషకులు చెప్పారు.

పీఎస్‌యూ బ్యాంకులు, మెటల్స్‌, ఆటో మొబైల్స్‌, ఫార్మాస్యూటికల్స్‌, ఐటీ షేర్లు భారీగా నష్టాలను ఎదుర్కొన్నాయి. చారిత్రాత్మక కనిష్ట స్థాయిల నుంచి కోలుకున్న రూపాయి ప్రభావం కూడా మార్కెట్లకు సహకరించలేదు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ స్వల్పంగా 8పైసలు బలపడి 74.14 వద్ద నమోదైంది. నేడు ఇంట్రాడేలో రూపాయి విలువ 74.47 వద్ద రికార్డు కనిష్టాన్ని తాకింది. కాగా, టాప్‌ గెయినర్లుగా యస్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ లాభాలు పండించగా.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, టాటా స్టీల్‌, ఇండియాబుల్స్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ నష్టాలు పాలయ్యాయి. అయితే గ్లోబల్‌గా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడంతో, ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు లాభాలను ఆర్జించాయి.

అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్‌ కుదించింది. ఈ రెండు దేశాలూ వచ్చే ఏడాదిలో వాణిజ్య వివాద ప్రభావాలను చవిచూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. దీంతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు  భారీగా నష్టపోయాయి. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రద్దు పద్దులోకి రూ 30,000 కోట్లు

‘సీఆర్‌ఐ పంప్స్‌’కు ఎన్‌ఈసీ అవార్డ్‌

తాజా మొండి బకాయిలు తగ్గాయ్‌: ఎస్‌బీఐ

10,900 పాయింట్లపైకి నిఫ్టీ

‘వోగో’లో ఓలా  రూ.720 కోట్ల పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాడీ పోరాట కళా శిక్షణలో కాజల్‌

రాజకీయం లేదు

కనిపించదు... వినిపించదు!

వైఎస్‌ జగన్‌ గారంటే నాకు ప్రాణం!

అందుకే సక్సెస్‌ మీట్‌  

ప్చ్‌..  మళ్లీ నిరాశే