లాభనష్టాల ఊగిసలాట : చివరకు నష్టాలు

17 Jun, 2020 16:03 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు  నష్టాలతో ముగిసాయి. రోజంతా లాభనష్టాల మధ్య తీవ్రంగా  ఊగిసలాడి చివరకు నష్టాలను మూటగట్టుకున్నాయి. చివరి అర్థ గంటలో భారీ అమ్మకాలతో కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను  కోల్పోయాయి.  సెన్సెక్స్   97 పాయింట్ల నష్టంతో 33507 వద్ద,  నిఫ్టీ  33 పాయింట్లు కోల్పోయి 9881 వద్ద ముగిసాయి.  బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసిజి, మెటల్  షేర్లు నష్టపోగా, ఆటో,ఐటీ, ఫార్మా లాభపడింది. భారతీ ఇన్‌ఫ్రాటెల్, పవర్ గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటిసి, శ్రీ సిమెంట్‌లు నిఫ్టీలో భారీగా నష్టపోగా, మారుతి భారీగా లాభపడగా యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐషర్ మెటార్స్ లాభపడ్డాయి.

అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి 76.22 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమై స్వల్ప లాభాలతో ముగిసింది.  4 పైసలు పుంజుకుని 76.16 వద్ద ముగిసింది.  మంగళవారం 76.21 స్థాయి వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. 


 

మరిన్ని వార్తలు