ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

19 Jul, 2018 16:05 IST|Sakshi

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. నిఫ్టీ సాంకేతికంగా తన కీలకమైన మార్కు 11వేల దిగువకు పడిపోయింది. నేటి ట్రేడింగ్‌లో అన్ని రంగాల సూచీలు మిక్స్‌డ్‌గా క్లోజయ్యాయి. మిడ్‌క్యాప్స్‌  షేర్లు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్‌ 22 పాయింట్ల నష్టంలో 36351 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల నష్టంలో 10957 వద్ద స్థిరపడ్డాయి. స్టాక్స్‌ అన్నింటిలోనూ ఎయిర్‌టెల్‌, వేదంత, టైటాన్‌, యస్‌ బ్యాంక్‌లు ఎక్కువగా లాభాలు పండించి టాప్‌ గెయినర్లుగా నిలువగా.. కొటక్‌ మహింద్రా బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, హిందాల్కోలు ఎక్కువగా నష్టపోయాయి.

మైండ్‌ట్రి బలహీనమైన ఫలితాలు, సీఎప్‌ఓ రాజీనామాతో భారీగా 8 శాతం మేర నష్టపోయింది. పీసీ జువెలరీ స్టాక్‌ కూడా 8 శాతం పడిపోయింది. ప్రారంభంలో మాత్రమే మంచి లాభాలను ఆర్జించిన మార్కెట్లు ఆ తర్వాత నుంచి అటుఇటుగా ట్రేడవుతూ వచ్చాయి. ఎక్కువగా ఫార్మాస్యూటికల్స్‌, మౌలిక సదుపాయాలు, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించిందని మార్కెట్‌ విశ్లేషకులు చెప్పారు. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా భారీగా 36 పైసల బలహీనపడి 68.98గా నమోదైంది.
 

>
మరిన్ని వార్తలు