ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

19 Apr, 2017 16:15 IST|Sakshi
ముంబై: ఆద్యంతం ఊగిసలాట ధోరణిలో కొనసాగిన బుధవారం స్టాక్ మార్కెట్లు, ఆఖరికి ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17.47 పాయింట్ల లాభంలో 29,336.57 వద్ద ముగియగా.. నిఫ్టీ 1.65 పాయింట్ల నష్టంలో 9103.50 వద్ద క్లోజైంది. రెండు సూచీల్లో అదానీపోర్ట్స్, బీహెచ్ఈఎల్, పవర్ గ్రిడ్, భారతీ ఇన్ఫ్రాటెల్లు టాప్ గెయినర్లుగా లాభాలు పండించగా.. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హీరో మోటార్ కార్ప్, అరబిందో ఫార్మా నష్టాల్లోనడిచాయి.
 
ఇండస్ఇండ్ బ్యాంకు లాభాల్లో అంచనాలను అందుకోలేకపోవడంతో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా 1-2 శాతం పడిపోయాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ స్వల్పంగా 5 పైసలు లాభపడి 64.58 వద్ద ట్రేడైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 190 రూపాయలు పడిపోయి 29,324 గా నమోదయ్యాయి.
మరిన్ని వార్తలు