కరోనా సంక్షోభం : 8300 దిగువకు నిఫ్టీ

30 Mar, 2020 16:25 IST|Sakshi

సాక్షి, ముంబై:  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం,  భారీగా పతనమైన చమురు ధరలు అంతర్జాతీయ ప్రతికూలసంకేతాలు,   దేశీయ స్టాక్ మార్కట్లు ఈ వారం ఆరభంలో కూడా భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆరంభలోనే వెయ్యి పాయింట్లకుపై పతనమైన సెన్సెక్స్  ఒక  దశలో ఏకంగా 15 వందల పాయింట్లుపైగా నష్టపోయింది. నిఫ్టీ 416 పాయింట్లు పడిపోయి 8,250 మార్క్ కంటే దిగువకు పడిపోయింది.  లాక్ డౌన్ కు పొడిగించే ఆలోచన ఏదీ లేదన్న  కేంద్రం ప్రకటనతో నష్టాలనుంచి కోలుకున్నప్పటకిఈ, చివరకు  సెన్సెక్స్ 1375 పాయింట్లు ( 4.61 శాతం) నష్టంతో 28,440వద్ద, , నిఫ్టీ 379 పతనమై 8281 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ ఆటోమొబైల్, మెటల్ స్టాక్స్ అమ్మకాలు ప్రభావితం చేశాయి. కోవిడ్-19 వ్యాప్తి ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీస్తుందనే భయాలు పెట్టుబడిదారులనువెంటాడుతున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ పరిశోధన హెడ్  దీపక్ జసాని అన్నారు. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ టాప్  లూజర్స్ గా ఉన్నాయి.  సిప్లా, టెక్ మహీంద్ర, నెస్లే, డా. రెడ్డీస్, యాక్సిస్ బ్యాంకు, గెయిల్, కోల్ ఇండియా లాభపడ్డాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు