80 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

15 Jun, 2017 15:50 IST|Sakshi
ముంబై : ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో పాటు ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచడంతో ఉదయం సెషన్ నుంచి అస్థిరంగా ట్రేడైన మార్కెట్లు చివరికీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 80 పాయింట్ల నష్టంలో 31,075 వద్ద, నిఫ్టీ 40.10 పాయింట్ల నష్టంలో 9,578 వద్ద క్లోజయ్యాయి. టీసీఎస్, రిలయన్స్ 2 శాతం మేర, ఎల్ అండ్ టీ 1 శాతం మేర పడిపోయాయి. వాటితో పాటు ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్ కూడా రెండు సూచీల్లో నష్టాలు పాలయ్యాయి. అదేవిధంగా రిలయన్స్, అరబిందో ఫార్మా, సిప్లాలు లాభాలు పండించాయి.
 
వడ్డీరేట్లను పావుశాతం పెంచుతూ అమెరికా ఫెడ్ రిజర్వు నిర్ణయం తీసుకోవడంతో అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధరలు పతనమయ్యాయి.  నేటి ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 236 రూపాయల మేర పడిపోయి 28,794 రూపాయలుగా ఉన్నాయి.. డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా 13 పైసల నష్టంతో 64.43గా నమోదయ్యాయి.
>
మరిన్ని వార్తలు