కొనసాగుతున్న సెన్సెక్స్ దూకుడు!

4 Jul, 2014 16:16 IST|Sakshi
కొనసాగుతున్న సెన్సెక్స్ దూకుడు!
హైదరాబాద్: ఆరంభంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్వల్ప నష్టాలకు లోనైన భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు చివర్లో రికార్డు గరిష్టస్థాయి వద్ద ముగిసాయి. వారాంతంలో నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 138 పాయింట్ల లాభంతో 25962 వద్ద, నిఫ్టీ 36 పాయింట్ల వృద్ధితో 7751 వద్ద క్లోజయ్యాయి. 
 
శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 25,844 పాయింట్ల వద్ద ఆరంభమై...25,981 గరిష్ట స్థాయిని, 25,659 కనిష్ట స్థాయిని, నిఫ్టీ 7,718 ప్రారంభమై 7,758 గరిష్ట స్థాయిని, 7,661 కనిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. 
 
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో పవర్ గ్రిడ్, రిలయన్స్, హెచ్ డీఎఫ్ సీ, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, గెయిల్ లాభాల్ని నమోదు చేసుకోగా, ఏసీసీ, సెసా స్టెర్ లైట్, విప్రో, జిందాల్ స్టీల్, యునైటెడ్ స్పిరిట్స్ నష్టాలతో ముగిసాయి. 
మరిన్ని వార్తలు