బ్యాంక్‌ నిఫ్టీ...ఫ్యూచర్స్‌ సిగ్నల్స్‌

13 Sep, 2017 00:24 IST|Sakshi
బ్యాంక్‌ నిఫ్టీ...ఫ్యూచర్స్‌ సిగ్నల్స్‌

ప్రపంచ ట్రెండ్‌ ప్రభావంతో మంగళవారం కూడా కొనసాగిన మన మార్కెట్‌ ర్యాలీలో ప్రధాన సూచీ నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్‌ నిఫ్టీ తక్కువ పెరిగింది. నిఫ్టీ 0.80 శాతం పెరగ్గా, బ్యాంక్‌ నిఫ్టీ మాత్రం 0.42 శాతం పెరుగుదలతో సరిపెట్టుకుని 24,785 పాయింట్ల వద్ద ముగిసింది. కానీ బ్యాంక్‌ నిఫ్టీ ఫ్యూచర్‌ కాంట్రాక్టు ఓపెన్‌ ఇంట్రస్ట్‌ (ఓఐ)లో 1.72 లక్షల షేర్లు (7.33 శాతం) యాడ్‌ అయ్యాయి. మొత్తం ఓఐ 25.16 లక్షల షేర్లకు పెరిగింది. క్రితం రోజు స్పాట్‌ బ్యాంక్‌ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్‌ 13 పాయింట్ల డిస్కౌంట్‌తో ముగియగా, ఆ డిస్కౌంట్‌ మంగళవారం 2 పాయింట్లకు తగ్గింది. తాజా లాంగ్‌ బిల్డప్‌ను ఈ యాక్టివిటీ సూచిస్తున్నది.

ఈ గురువారం ముగిసే వీక్లీ ఆప్షన్స్‌ విభాగంలో 25,000 స్ట్రయిక్‌ వద్ద తాజా కాల్‌రైటింగ్‌ ఫలితంగా 2.43 లక్షల షేర్లు యాడ్‌కాగా, 11.08 లక్షల షేర్లతో భారీ కాల్‌ బిల్డప్‌ ఇక్కడ వుంది. 24,500, 24,600, 24,700 స్ట్రయిక్స్‌ వద్ద పుట్‌ రైటింగ్‌ జరగ్గా, అన్నింటికంటే ఎక్కువగా 24,700 స్ట్రయిక్‌ పుట్‌ ఆప్షన్లో 3.28 లక్షల షేర్లు యాడ్‌ అయ్యాయి. ఇక్కడ 4.63 లక్షల షేర్ల బిల్డప్‌ వుంది. మిగతా రెండు స్ట్రయిక్స్‌ వద్ద 2.50 లక్షల చొప్పున షేర్లు యాడ్‌ అయ్యాయి.

24,600 స్ట్రయిక్‌ వద్ద 5.47 లక్షలు, 24,500 స్ట్రయిక్‌ వద్ద 7.53 లక్షల షేర్ల చొప్పున బిల్డప్‌ వుంది. వచ్చే రెండు రోజుల్లో బ్యాంక్‌ నిఫ్టీ 24,700పైన స్థిరపడితే 25,000 స్థాయిని తాకే అవకాశం వుంటుందని, 25,140 పాయింట్ల రికార్డుస్థాయిని చేరాలంటే 25,000 పాయింట్లస్థాయిని బలంగా దాటాల్సివుంటుందని కాల్‌ ఆప్షన్‌ డేటా సూచిస్తున్నది. క్షీణత సంభవిస్తే 24,500–24,700 పాయింట్ల శ్రేణి మధ్య మద్దతు పొందవచ్చని పుట్‌ ఆప్షన్‌ డేటా వెల్లడిస్తున్నది. 

మరిన్ని వార్తలు