శుభప్రదంగా ముగిసిన శుక్రవారం

14 Sep, 2018 16:00 IST|Sakshi
త్రిపుల్‌ సెంచరీని బీట్‌ చేసిన సెన్సెక్స్‌ (ప్రతీకాత్మక చిత్రం)

ముంబై : స్టాక్‌ మార్కెట్ల శుక్రవారం ట్రేడింగ్‌ శుభప్రదంగా ముగిసింది. మంచి లాభాలతో బెంచ్‌మార్క్‌ సూచీలు ఈ వారం ట్రేడింగ్‌కు ముగింపు పలికాయి. నిఫ్టీ 11,500 మార్కు పైన క్లోజ్‌ కాగా, నిఫ్టీ త్రిపుల్‌ సెంచరీని బీట్‌ చేసి దూసుకుపోయింది. అన్ని రంగాల సూచీల్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. బ్యాంక్‌లు, ఆటోమొబైల్స్‌, మెటల్స్‌, ఫార్మాస్యూటికల్‌ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. మిడ్‌క్యాప్స్‌ కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌కు మంచి బూస్ట్‌ అందించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 2 శాతం లాభాల పంట పండించింది. 

మార్కెట్‌ అవర్స్‌ ముగిసే నాటికి సెన్సెక్స్‌ 373 పాయింట్లు లాభపడి 38,091 వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు బలపడి 11,515 వద్ద స్థిరపడ్డాయి. నేటి ట్రేడింగ్‌లో వేదంత, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండియాబుల్స్‌ హౌజింగ్‌, బీపీసీఎల్‌ టాప్‌ గెయినర్లుగా నిలువగా.. కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ టాప్‌ లూజర్లుగా ఉన్నాయి. చివరి గంట ట్రేడింగ్‌లో మార్కెట్లు తమ లాభాలను మరింత పెంచుకున్నాయని విశ్లేషకులు చెప్పారు. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా నేటి ట్రేడింగ్‌లో బాగానే లాభపడింది. 21 పైసలు లాభపడిన రూపాయి 71.97 వద్ద నమోదైంది.

మరిన్ని వార్తలు