5 రోజుల నష్టాలకు బ్రేక్‌: గట్టెక్కిన మార్కెట్లు

14 Aug, 2017 16:13 IST|Sakshi
ముంబై : బెంచ్‌ మార్కు సూచీలు గత ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేకిచ్చాయి. సోమవారం ట్రేడింగ్‌ ముగింపుల్లో మార్కెట్లు లాభాల్లో నమోదయ్యాయి. సెన్సెక్స్‌ 235.44 పాయింట్ల లాభంలో 31,449.03 వద్ద, నిఫ్టీ 83.35 వద్ద 9794.15 వద్ద క్లోజ్‌ అయ్యాయి. నేటి ట్రేడింగ్‌లో మెటల్‌, హెవీ వెయిట్‌ బ్యాంకింగ్‌ స్టాక్స్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ స్టాక్స్‌లో ఎక్కువగా కొనుగోలు జరిగాయి. బలహీనమైన అమెరికా ద్రవ్యోల్బణ డేటాతో ఆసియన్‌ షేర్లలో కొనుగోలు మద్దతు లభించింది. సిప్లా ఎక్కువగా 5.4 శాతం లాభాలు పండించింది. దాని తర్వాత వేదాంత, టాటా స్టీల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, అదానీ పోర్ట్స్‌, సన్‌ ఫార్మాలు లాభాల్లో కొనసాగాయి.
 
నేటి ట్రేడింగ్‌లో టాప్‌ గెయినర్లుగా బ్యాంకులు నిలిచాయి. గత వారంగా 3.4 శాతం కోల్పోయిన బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌, 0.9 శాతం పైకి ఎగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు 2.6 శాతం, 1.1 శాతం లాభాలు పండించాయి. ఎస్‌బీఐ, కొటక్‌ మహింద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, బోస్క్‌ షేర్లు రెండు సూచీల్లో నష్టాలు పాలయ్యాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలపడి 64.11గా ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 144 రూపాయల నష్టంలో 29,059 రూపాయలుగా నమోదయ్యాయి.  
>
మరిన్ని వార్తలు