1000 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్

31 Mar, 2020 15:51 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఇంట్రా డేలో సెన్సెక్స్ 1200  పాయింట్లకుపైగా ఎగిసింది, నిప్టీ కూడా 8600 పాయింట్లను టచ్ చేసినప్పటికీ ఆఖరి గంటలో లాభాల స్వీకరణ కనిపించింది. దీంతో సెన్సెక్స్ 1028 పాయింట్ల లాభంతో 29468 వద్ద, నిఫ్టీ 316 పాయింట్ల లాభంతో 8597 వద్ద  స్థిరపడ్డాయి.  తద్వారా ఈ ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగులో సెన్సెక్స్ 29500 చేరువలో, నిఫ్టీ 86వేల పాయింట్ల చేరువలో దృఢంగా ముగిసాయి.  మెటల్స్, పీఎస్‌ఈ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లోని షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చివర్లో  బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ధోరణి నెలకొంది. బీపీసీఎల్, గయిల్, బ్రిటానియా, ఓఎన్ జీసీ, హిందాల్కో,రిలయన్స్ , విప్రో, టెక్ మహీంద్ర,  యూపీఎల్, ఐటీసీ టాప్ విన్నర్స్ గా ఉన్నాయి. మరోవైపు ఇండస్ ఇండ్, బజాజ్ ఫినాన్స్, టైటన్, మారుతి సుజుకి,కోటక్ మహీంద్ర నష్టపోయాయి. మరోవైపు డాలరు మారకంలో లాభపడిన దేశీయ కరెన్సీ   రూపాయి  75.51 వద్ద  వుంది. 

మరిన్ని వార్తలు