కొనుగోళ్ల జోరు : 500 పాయింట్లు లాభం

6 Aug, 2019 14:36 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లు  ప్రతికూలంగా ఉన్నప్పటికీ, దేశీయంగా  కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ ఆరంభ లాభాల నుంచి భారీగా ఎగిసి ఏకంగా 512 పాయింట్ల మేర పుంజుకుంది. తద్వారా 37200 కీలకమార్క్‌ ఎగువకు చేరింది. నిఫ్టీ కూడా అదే  జోరును కంటిన్యూ చేస్తూ 142 పాయింట్లు ఎగసి 11వేల ఎగువకు చేరడం విశేషం. ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌ మార్కెట్లకు జోష్‌ నిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

మీడియా తప్ప అన్ని రంగాల్లోనూ లాభాల జోష్‌ నెలకొంది.  హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ అండ్‌టీ ఐబీ హౌసింగ్‌, ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా, యస్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, ఇండస్‌ఇండ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ టాప్‌ విన్నర్స్‌గా కొనసాగుతున్నాయి.   బ్యాంకింగ్‌  షేర్లలో  ఐసీఐసీఐ, కోటక్‌,  ఎస్‌బీఐ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇండియాబుల్స్‌ ఒబెరాయ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఫీనిక్స్‌, శోభా, ప్రెస్టేజ్‌  తదితర  రియాల్టీ షేర్లు కూడా బాగా పుంజుకున్నాయి. మరోవైపు జీ 6శాతం పతనంకాగా, సిప్లా, పవర్‌గ్రిడ్‌, విప్రో, టాటా మోటార్స్‌, బ్రిటానియా, ఆర్‌ఐఎల్‌, టీసీఎస్‌, ఓఎన్‌జీసీ  బలహీనంగా ట్రేడ్‌ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు