స్మార్ట్‌ రికవరీ: అయినా భారీ నష్టాలే

6 Feb, 2018 16:45 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ రికవరీ సాధించినప్పటికీ నెగిటివ్‌ సంకేతాలనే అందించాయి. వెయ్యిపాయింట్లకు పైగా భారీనష్టాలనుంచి స్మార్ట్‌ రికవరీ సాదించిన సెన్సెక్స్‌ 561 పాయింట్లు కోల్పోయి 34, 195 వద్ద, నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో 10,498 వద్ద ముగిశాయి. అంతర్జాతీయ తీవ్ర ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఆరంభంలోనే దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ స్థాయిలో కుప్పకూలాయి. బడ్జెట్‌ ప్రకంపనలు మంగళవారం కూడా కొనసాగాయి. దాదాపు 1276 పాయింట్ల పతనంతో గ్యాప్‌డౌన్‌ ఓపెన్‌తో సెన్సెక్స్‌ 34వేల దిగువకు (33,482)పడిపోయింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగింది.  కొన్ని కౌంటర్లలో వాల్యూ బైయింగ్‌తో దాదాపు 700పాయింట్ల రికవరీ సాధించింది.

ఆయిల్‌ ఇండియా, భారతి ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫిన్‌, ఐసీఐసీఐ, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఐషర్‌ మోటార్స్‌, టాటా స్టీల్‌ లాభపడగా, ఆర్‌కాం, రిలయన్స్‌, లుపిన్‌, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌మహీంద్రా, టీసీఎస్‌ ,కోటక్‌బ్యాంక్‌ , హీరో మోటోకార్ప్‌ తదితర షేర్లు భారీగా నష్టపోయాయి.

మరిన్ని వార్తలు