ఆరో రోజు నష్టపోయిన స్టాక్‌మార్కెట్లు

7 Oct, 2019 17:29 IST|Sakshi

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో ఒడిదుడుకులకు లోనయినా వరుసగా ఆరో రోజు నష్టాల్లో ముగిశాయి. ఆర్థిక సంక్షోభ భయాలు ఇన్వెస్టర్లపై ప్రభావం చూపడంతో బ్యాంకింగ్‌ సహా పలు రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 141 పాయింట్లు నష్టపోయి 37,531కి పడిపోయింది. నిఫ్టీ 48 పాయింట్లు పతనమై 11,126 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.71.05 గా ఉంది. ఉదయం మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమైన, అంతర్జాతీయంగా పలురంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో మార్కెట్లు నష్టాల వైపు మళ్లాయి. యస్ బ్యాంక్ (8.19%), యాక్సిస్ బ్యాంక్ (2.53%), బజాజ్ ఆటో (1.03%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.62%), భారతి ఎయిర్ టెల్ (0.53%) లాభాల బాటలో పయనించగా.. టాటా స్టీల్ (-2.49%), ఓఎన్జీసీ (-2.43%), ఐటీసీ (-2.18%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.00%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.76%)భారీగా నష్టపోయాయి.

మరిన్ని వార్తలు