మూడో రోజు అదే తీరు, నష్టాల్లో సూచీలు

27 Feb, 2020 09:32 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాలతో ప్రారంభమైనాయి.  అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్‌ 200 పాయింట్లు పతనమై 39690 వద్ద, నిప్టీ 55 పాయింట్ల నష్టంతో 11623 వద్ద కొనసాగుతున్నాయి.  తద్వారా కీలక  సూచీలు రెండు ప్రదాన మద్దతు స్థాయిలకు దిగువకు  చేరాయి.  దాదాపు అన్నిరంగాల షేర్లు నష్టపోతున్నాయి.  ప్రధానంగా బ్యాంకింగ్‌, టెక్‌,ఆటో షేర్లు భారీగా నష్టపోతున్నాయి.  హెచ్‌సీఎల్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎం అండ్‌ ఎం,  ఐసీఐసీఐ బ్యాంకు, సన్‌ ఫార్మా నష్టపోతున్నాయి. యస్‌ బ్యాంకు,  ఎన్‌టీపీసీ, టైటన్‌, కోటక మహీంద్ర, లార్సెన్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, హీరో మోటోకార్ప్‌ లాభపడుతున్నాయి

మరిన్ని వార్తలు