అమ్మకాల దెబ్బ : ఫ్లాట్‌గా మార్కెట్లు

16 Oct, 2019 14:48 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయస్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గామళ్లాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా ఎగిసినప్పటికీ  తరువాత బలహీనపడ్డాయి.ముఖ్యంగా బ్యాంకింగ్‌ సెక్టార్‌లో అమ్మకాలు జోరు కొనసాగడంతో ఒక దశలో సెన్సెక్స్‌ డే హై నుంచి 250 పాయింట్లు కుప్ పకూలింది. సెన్సెక్స్‌ ప్రస్తుతం 15 పాయింట్ల నామమాత్రపు లాభంతో 38517వద్ద, నిఫ్టీ 14పాయింట్ల లాభంతో1144 వద్ద కొనసాగుతున్నాయి.  ప్రధానంగా మీడియా, బ్యాంక్స్‌, రియల్టీ, ఐటీ  స్వల్ప లాభాలతో, మెటల్‌ స్వల్ప నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి.  బీపీసీఎల్‌ 4.2 శాతం లాభపడగా, జీ, బజాజ్ ఫైనాన్స్‌, గ్రాసిమ్‌, విప్రో, యస్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఫిన్‌, ఐవోసీ, అల్ట్రాటెక్‌  లాభాల్లో ఉన్నాయి.  మరోవైపు  వేదాంతా, ఐషర్‌, ఇన్ఫ్రాటెల్‌, అదానీ పోర్ట్స్‌, హిందాల్కో, సిప్లా, గెయిల్‌, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్‌  నష్టపోతున్నాయి.

మరిన్ని వార్తలు