వరుసగా రెండో రోజూ నష్టాలే

21 Nov, 2018 15:47 IST|Sakshi

సాక్షి, ముంబై: వరుసగా రెండో సెషన్లో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు భారీ పతనాన్ని నమోదు చేయడంతో కీలక సూచీలు అదే బాట పట్టాయి. సెన్సెక్స్‌ 275 పాయింట్లు క్షీణించి వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పతనమై వద్ద స్థిరపడింది. ఐటీ నష్టపోగా, ఫార్మా సెక్టార్‌ లాభపడింది. 

ఐటీలో టీసీఎస్, ఇన్ఫోసిస్‌, మైండ్‌ట్రీ, టెక్‌ మహీంద్రా, టాటా ఎలక్సీ, నిట్‌ టెక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో 4-2 శాతం మధ్య నష్టపోయాయి. వీటితోపా ఆటు ఆర్‌ఐఎల్‌ కూడా 2 శాతం నష్టపోయింది. ఫార్మాలో డాక్టర్‌ రెడ్డీస్‌ 7 శాతం లాభంతో టాప్‌ విన్నర్‌గా నిలిచింది. దీంతోపాటు అరబిందో, బయోకాన్‌, గ్లెన్‌మార్క్‌, సన్‌ ఫార్మా, సిప్లా, కేడిలా లాభపడ్డాయి. ఇక పీఎస్‌యూ బ్యాంక్స్‌లో యూనియన్‌, ఓరియంటల్‌, కెనరా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బీవోబీ, ఇండియన్‌, విజయా, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, సిండికేట్‌, సెంట్రల్‌ బ్యాంక్‌,ఎస్‌బ్యాంకు లాభపడ్డాయి. ఇంకా గ్రాసిం, బజాజ్‌ ఫిన్‌, యూపిఎల్‌ తోపాటు ఆయిల్‌ కంపెనీల షేర్లు కూడా లాభాల్లో ముగిసాయి

మరిన్ని వార్తలు