నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

6 Dec, 2017 14:57 IST|Sakshi

ముంబై : ఆర్‌బీఐ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం, గ్లోబల్‌ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరింత కిందకి పడిపోయాయి. 200 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్‌ 205 పాయింట్ల నష్టంలో 32,597 వద్ద ముగిసింది. నిఫ్టీ 74 పాయింట్ల నష్టంలో 10,044 వద్ద క్లోజైంది. ఆర్‌బీఐ పాలసీ ప్రకటనాంతరం బ్యాంకు షేర్లు మరింత నష్టాలు పాలయ్యాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ రంగాల షేర్లలో  భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దాదాపు అన్ని రంగాల షేర్లు కూడా నేటి ట్రేడింగ్‌లో నష్టాల్లోనే కొనసాగాయి.

ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని ఆర్‌బీఐ అంచనావేస్తోంది. దీంతో కీలక వడ్డీరేటు రెపోను యథాతథంగా 6 శాతంగా ఉంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ 1.5 శాతం కిందకి పడిపోయింది. నిఫ్టీ బ్యాంకు 170 పాయింట్లు నష్టాలు పాలైంది. మెటల్‌ ఇండెక్స్‌ కూడా 2 శాతం పైగా కిందకి దిగజారింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసల నష్టంలో 64.47 వద్ద ఉంది. 

మరిన్ని వార్తలు