భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు 

24 Jul, 2019 11:37 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయస్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఫ్లాట్‌గా మొదలైన మార్కెట్లు వెంటనే లాభాలవైపు మళ్లాయి. కానీ అమ్మకాల జోరుతో సెన్సెక్స్‌ 260 పాయింట్లుకు పైగా పతనమైంది. నిఫ్టీ కూడా 11300 స్థాయిని కోల్పోయింది. సెన్సెక్స్‌ 38వేలకు దిగువకు చేరింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో  దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి.

ముఖ‍్యంగా బ్యాంకింగ్‌, మెటల్‌  కౌంటర్ల నష్టాలు ప్రభావితం చేస్తున్నాయి. ఆటో, రియల్టీ, ఫార్మా రంగాలదీ ఇదే బాట. బీపీసీఎల్‌, వేదాంతా, యూపీఎల్‌, మారుతీ, సిప్లా, బజాజ్‌ ఆటో, హీరో మోటో, ఐవోసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో నష్టాల్లో,  యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌  లాభపడుతున్నాయి.

మరిన్ని వార్తలు