ప్రతికూలంగా మార్కెట్లు

18 Dec, 2018 14:03 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు బలహీనంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 200 పాయింట్లకుపైగా కోల్పోయింది సెన్సెక్స్‌. అటు నిఫ్టీ కూడా 10850  దిగువకు చేరింది. ప్రస్తుతం 91 పాయింట్ల నష్టంతో 36,179 వద్ద, నిఫ్టీ  30 పాయింట్ల వెనకడుగుతో 10,857వద్ద  కొనసాగుతోంది. 

ఆటో మినహా మీడియా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్‌ నిఫ్టీ, ఫార్మా, రియల్టీ, మెటల్‌ రంగాల షేర్లు నష్టపోతున్నాయి.  జీ, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్ మహీంద్రా, ఐబీ హౌసింగ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ, ఐషర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌  లాభాల్లోనూ, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, బజాజ్‌ ఆటో, హీరోమోటో, ఐవోసీ, యూపీఎల్‌, ఎల్‌అండ్‌టీ లాభాల్లోనూ  ట్రేడ్‌ అవుతున్నాయి. 

మరోవైపు క్రూడ్‌ధరలు  14న నెలల  కనిష్టాన్ని నమోదు చేయడంతో రూపాయి బాగా పుంజుకుంది. డాలరు మారకంలో  ఆరంభం లాభాల నుంచిమరింత ఎగిసింది. 56 పైసలు  లాభంతో 71 వద్ద ట్రేడ్‌అవుతున్నది.
 

మరిన్ని వార్తలు