నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు 

14 Jun, 2019 09:36 IST|Sakshi

నిఫ్టీ 11900  దిగువకు

100 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ 

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి.  గురువారం ఆటుపోట్ల మధ్య కదలాడిన సూచీలు  వరుసగా రెండో  రోజు కూడా  నెగిటివ్‌గా ట్రేడింగ్‌నుకొనసాగిస్తున్నాయి.  ఆరంభ స్థాయినుంచి మరింత కిందికి దిగజారి 100 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్‌ 124 పాయింట్లు క్షీణించి 39618  వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు  నష్టపోయి 11866 వద్ద కొనసాగుతోంది. తద్వారా నిఫ్టీ 11900  దిగువకు చేరింది.  మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఇలా  అన్ని సెక్టార్లలోనే సెల్లింగ్‌ ప్రెజర్‌ కనిపిస్తోంది.

డా.రెడ్డీస్‌, గ్రాసిం, ఆర్‌ఐఎల్‌, ఇన్ఫోసిస్‌, టాటామోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు, జీ, బీపీసీఎల్‌, ఇండియా బుల్స్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు పవర్‌గ్రిడ్‌, గెయిల్‌, వేదాంతా, యూపీఎల్‌ లాభ పడుతున్నాయి.  అటు డారు మారకంలో కరెన్సీ రూపాయి బలహీనంగా ఉంది. 

మరిన్ని వార్తలు