అమ్మకాల వెల్లువ: 200 పాయింట్లు నష్టం

24 Dec, 2018 15:09 IST|Sakshi

సాక్షి,ముంబై:ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల సంకేతాలతో స్వల్పనష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు మిడ్‌సెషన్‌ తరువాత అకస్మాత్తుగా భారీ నష్టాల్లోకి జారు కున్నాయి.   లాభనష్టాల మధ్య  ఊగిసలాడుతున్న కీలక సూచీల్లో సెన్సెక్స్‌ ఏకంగా 258 కుప్ప కూలి 35, 483 స్థాయికి, నిఫ్టీ  78 పాయింట్లు క్షీణించి 10, 675వద్ద కొనసాగుతున్నాయి.  మరోవైపు  గురువారం(27న) డిసెంబర్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగియ నుంది.

రియల్టీ, మీడియా, మెటల్‌, ఆటో బ్యాంక్‌ నిఫ్టీ  నష్టపోతుండగా, ఐటీ  స్వల్పంగా లాభపడుతోంది.  టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, ఐటీసీ, సన్‌ ఫార్మా, గ్రాసిమ్‌, అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా  లాభాల్లో ఉండగా హీరోమోటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌,  బజాజ్‌ ఆటో, జీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఐవోసీ, ఐషర్, హెచ్‌సీఎల్‌ టెక్‌, హిందాల్కో, వేదాంతా టాప్‌ లూజర్స్‌గా  ఉన్నాయి.

మరిన్ని వార్తలు