పెట్రో షాక్, నష్టాల్లో మార్కెట్లు 

6 May, 2020 09:41 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌ మార్కెట్ స్వల్ప లాభాలతో  ట్రేడింగ్ ఆరంభించినా వెంటనే నష్టాల్లోకి జారుకుంది. వరుసగా రెండో రోజు  కూడా బలహీనతను కొనసాగిస్తున్నాయి.  అమ్మకాల ఒత్తిడితో  నిఫ్టీ 9150 దిగువకు పడిపోయింది.  బ్యాంక్‌ నిఫ్టీ  కూడా 19 వేల స్థాయిని బ్రేక్ చేసింది. ఒక దశలో 300 పాయింట్లకు పైగా పతనమైన  సెన్సెక్స్‌ 238 పాయింట్లు నష్టంతో 30214 వద్ద  నిఫ్టీ 74 పాయింట్లు నష్టంతో 9131వద్ద ట్రేడవుతున్నాయి.  పెట్రో అమ్మకాల  పన్ను సెగతో  ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లు భారీగా నష్టపోతున్నాయి.  హెచ్‌పీసీల్‌ 10శాతం, బీపీసీఎల్‌ 8శాతం,  ఐఓసీ 5శాతం నష్టంతో ట్రేడవుతోన్నాయి. దీంతోపాటు బ్యాంకింగ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.  (బ్యాంకుల దెబ్బ, చివరికి నష్టాలు)

మరిన్ని వార్తలు